ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sudas Media
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • ఇతరాలు
    • విద్య
      • అడ్మిషన్లు
      • డిగ్రీ
      • పరీక్షలు
      • ఉన్నత విద్య
      • ఇంటర్మీడియట్
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • స్కూల్ విద్య
      • విదేశీ విద్య
      • విశ్వవిద్యాలయాలు
    • వినోదం
      • బాలీవుడ్
      • బాక్స్ ఆఫీస్
      • సెలబ్రిటీలు
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • మూవీ రివ్యూలు
      • సంగీతం
      • OTT
      • శాండల్‌వుడ్
      • టాలీవుడ్
      • ట్రైలర్లు
      • టీవీ షోలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • ఎక్స్‌క్లూజివ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ప్రత్యేక కథనాలు
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
    • అభిప్రాయం
      • విశ్లేషణ
      • కాలమ్‌లు
      • సంపాదకీయం
      • నిపుణుల అభిప్రాయాలు
      • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
      • జ్యోతిష్యం
      • భక్తి
      • పండుగలు
      • రాశిఫలాలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
      • దేవాలయాలు
      • వాస్తు
    • టెక్నాలజీ
      • యాప్స్
      • కృత్రిమ మేధస్సు
      • సైబర్ సెక్యూరిటీ
      • గాడ్జెట్స్
      • హార్డ్‌వేర్
      • ఇంటర్నెట్
      • మొబైల్ ఫోన్లు
      • సోషల్ మీడియా
      • సాఫ్ట్‌వేర్
      • టెలికాం
చదువుతున్నారు: ఆదాయ వనరులు, ఆర్థిక సంఘాలు, ఉపాధి, మారుతున్న జనాభా నిర్మాణం
షేర్ చేయండి
Sudas MediaSudas Media
అక్షర పరిమాణంAa
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
Search
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • ఆర్థికం
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
  • ఇతరాలు
    • విద్య
    • వినోదం
    • తాజా వార్తలు
    • అభిప్రాయం
    • ఆధ్యాత్మికం
    • టెక్నాలజీ
మమ్మల్ని అనుసరించండి
  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన
© 2026 Sudas Media. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > రాజకీయాలు > తెలంగాణ రాజకీయాలు > ఆదాయ వనరులు, ఆర్థిక సంఘాలు, ఉపాధి, మారుతున్న జనాభా నిర్మాణం
తాజా వార్తలుతెలంగాణతెలంగాణ రాజకీయాలు

ఆదాయ వనరులు, ఆర్థిక సంఘాలు, ఉపాధి, మారుతున్న జనాభా నిర్మాణం

oneadmin
oneadmin
5 నెలలు క్రితం
షేర్ చేయండి
ఆదాయ వనరులు, ఆర్థిక సంఘాలు, ఉపాధి, మారుతున్న జనాభా నిర్మాణం
షేర్ చేయండి

(తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం – భాగం 2)

–సిహెచ్.వి. ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్టు, 9391533339

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి దశలో అధిక వృద్ధి రేటుతో పాటు బలమైన స్వంత ఆదాయ వనరులను కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, సేవారంగాల విస్తరణ వల్ల రాష్ట్రానికి పన్నుల ఆదాయం వేగంగా పెరిగింది. అయితే పదేళ్ల తర్వాత పరిశీలిస్తే, ఈ ఆదాయ నిర్మాణంలో బలాలు ఎంత ఉన్నాయో, అంతే స్థాయిలో బలహీనతలు కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది.

తెలంగాణ స్వంత పన్నుల ఆదాయంలో ప్రధానంగా ఎస్‌జీఎస్‌టీ, మద్యం ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, పెట్రోల్-డీజిల్‌పై వ్యాట్, మోటార్ వెహికల్ పన్నులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జీఎస్‌టీ అమలుకు ముందు రాష్ట్రాలకు వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ వంటి పన్నులపై అధిక స్వేచ్ఛ ఉండేది. 2017 తర్వాత జీఎస్‌టీ అమలులోకి రావడంతో ఆ స్వేచ్ఛ తగ్గిపోయింది. కేంద్రం ఐదేళ్ల పాటు పరిహారం ఇచ్చినప్పటికీ, ఆ కాలం ముగియడంతో రాష్ట్రాలు మళ్లీ తమ స్వంత ఆదాయ వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆదాయ వనరులు, ఆర్థిక సంఘాలు, ఉపాధి, మారుతున్న జనాభా నిర్మాణం

తెలంగాణలో 2016 నుంచి 2022 వరకు రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరించడంతో రిజిస్ట్రేషన్ల ద్వారా భారీ ఆదాయం లభించింది. కోకాపేట, నియోపోలిస్ వంటి ప్రాంతాల్లో భూముల వేలంపాటల ద్వారా వేల కోట్ల రూపాయలు వచ్చాయి. అయితే భూముల విక్రయం పునరావృతమయ్యే ఆదాయ వనరు కాదు. ఒకసారి విక్రయించిన ఆస్తి శాశ్వతంగా ప్రభుత్వ పరిధి నుంచి బయటకు వెళుతుంది. అందువల్ల భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థిరమైన ఆర్థిక వనరుగా పరిగణించలేమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ ప్రధాన ఆదాయ వనరులు

ఆదాయ వనరు ప్రాధాన్యం
SGST అత్యధికం
మద్యం ఎక్సైజ్ అధికం
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికం
పెట్రోల్, డీజిల్ వ్యాట్ మధ్యస్థం
మోటార్ వెహికల్ పన్నులు మధ్యస్థం

మద్యం అమ్మకాలపై ఆధారపడటం కూడా మరో కీలక అంశంగా మారింది. ఎక్సైజ్ ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతున్నప్పటికీ, ఇది సామాజిక, ఆరోగ్యపరమైన సమస్యలను కూడా సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ ద్వారా కూడా రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం లభిస్తోంది. వాహనాల సంఖ్య పెరగడంతో మోటార్ వెహికల్ పన్నులు కూడా పెరిగాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ, ఇంధన వినియోగంలో మార్పులు భవిష్యత్తులో ఈ ఆదాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఆర్థిక సంఘాల ప్రభావం

11వ, 12వ ఆర్థిక సంఘాల కాలంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండేది. 13వ ఆర్థిక సంఘం అమలులో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. అయితే పంపిణీ సూత్రాల్లో ఆదాయ దూరం, జనాభా వంటి ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణకు ఆశించిన మేర ప్రయోజనం కలగలేదని రాష్ట్రం వాదిస్తోంది.

15వ ఆర్థిక సంఘం 1971 జనాభా స్థానంలో 2011 జనాభా ప్రమాణాన్ని అనుసరించడం దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తికి కారణమైంది. కుటుంబ నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలు పరోక్షంగా నష్టపోయాయని తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక కూడా అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై తెలంగాణ ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర పన్నుల పంపిణీ, ప్రత్యేక గ్రాంట్లు, విభజన హామీల అమలు వంటి అంశాలు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.

ఉపాధి – అభివృద్ధి అంతా ఉద్యోగాలుగా మారిందా?

ఐటీ రంగం తెలంగాణ విజయగాథలో కీలక భాగంగా నిలిచింది. లక్షలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించాయి. ఫార్మా, లైఫ్ సైన్సెస్, సేవారంగాలు కూడా ఉపాధి కల్పించాయి. అయినప్పటికీ తయారీ రంగం ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. చైనా, వియత్నాం, తమిళనాడు, గుజరాత్‌ల మాదిరిగా భారీ తయారీ కేంద్రంగా తెలంగాణ ఎదగలేకపోయింది.

వ్యవసాయ రంగం నుంచి బయటకు వస్తున్న యువతకు స్థిరమైన, అధిక వేతన ఉద్యోగాలను సృష్టించడంలో రాష్ట్రం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడే ధోరణి కూడా యువతలో పెరిగింది. నిరుద్యోగం, నైపుణ్యాల కొరత, ప్రైవేట్ రంగ అవసరాలకు విద్యా వ్యవస్థ మధ్య అంతరం ఇంకా కొనసాగుతోంది.

మారుతున్న జనాభా నిర్మాణం

తెలంగాణ ప్రస్తుతం యువ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం. కానీ రాబోయే రెండు దశాబ్దాల్లో వృద్ధాప్య జనాభా వేగంగా పెరగనుంది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో సుమారు 12 శాతం మంది వృద్ధులు ఉండగా, 2036 నాటికి ఇది 17 శాతానికి చేరే అవకాశం ఉంది. ఇది ఆర్థిక పరంగా కొత్త సవాళ్లను తెస్తుంది.

వృద్ధుల సంఖ్య పెరగడం అంటే పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత, వృద్ధాప్య సంరక్షణపై ప్రభుత్వ వ్యయం కూడా పెరగడం. అదే సమయంలో యువ జనాభా శాతం తగ్గడం వల్ల పన్నులు చెల్లించే జనాభా, పని చేసే వయస్సు గల ప్రజల సంఖ్యపై ప్రభావం పడే అవకాశం ఉంది.

పెన్షన్లు, జీతాలు, వడ్డీలు – పెరుగుతున్న శాశ్వత భారం

రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు కలిపి పెద్ద భాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఈ మూడు అంశాలు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా చెల్లించాల్సిన వ్యయాలు. ఇవి పెరుగుతున్న కొద్దీ కొత్త మౌలిక వసతులు, పారిశ్రామిక పెట్టుబడులు, విద్య, ఆరోగ్య రంగాలకు అందుబాటులో ఉండే నిధులు తగ్గిపోతాయి.

కొత్త ఆదాయ వనరుల విషయంలో లోపిస్తున్న దీర్ఘకాలిక వ్యూహం

ఐటీ రంగం తెలంగాణకు పెద్ద బలం. కానీ ఒక్క ఐటీ రంగంపై ఆధారపడటం ప్రమాదకరం. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్, రక్షణ పరిశ్రమలు, డీప్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, పరిశోధన ఆధారిత తయారీ రంగాల్లో భారీ పెట్టుబడులు, విశ్వవిద్యాలయాలు-పరిశ్రమల అనుసంధానం, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అత్యవసరం.

భూముల అమ్మకాలు, మద్యం ఆదాయం, రియల్ ఎస్టేట్‌పై ఆధారపడే నమూనా శాశ్వతం కాదు. భవిష్యత్తులో సంపదను సృష్టించేది జ్ఞానం, సాంకేతికత, పరిశోధన, తయారీ రంగాలే.

అసలు ప్రశ్న

తెలంగాణ గత పదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందిందనడంలో సందేహం లేదు. కానీ ఈ అభివృద్ధి ఎంతవరకు స్థిరమైనది? పెరుగుతున్న వృద్ధాప్య భారం, శాశ్వత వ్యయాలు, పరిమితమైన కొత్త ఆదాయ వనరులు, మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య తెలంగాణ తన వృద్ధిని కొనసాగించగలదా?

ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతోంది.

ప్రధాన ఆర్థిక సవాళ్లు

✔ వృద్ధాప్య జనాభా పెరుగుదల
✔ పెన్షన్ భారం
✔ వడ్డీ చెల్లింపులు
✔ తయారీ రంగంలో పరిమిత వృద్ధి
✔ భూముల అమ్మకాలపై ఆధారపడటం
✔ కొత్త ఆదాయ వనరుల కొరత
✔ నైపుణ్యాలు-ఉద్యోగాల మధ్య అంతరం

(– భాగం 3లో తెలంగాణ రైజింగ్-2047, మెట్రో రెండో దశ, ఫ్యూచర్ సిటీ, ముసీ ప్రాజెక్ట్, అప్పుల భవిష్యత్తు, 2047 లక్ష్యాల సాధ్యాసాధ్యాలపై విశ్లేషణ.)

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
మునుపటి కథనం తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం: మిగులు రాష్ట్రం నుంచి అప్పుల ఒత్తిడి వరకు తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం: మిగులు రాష్ట్రం నుంచి అప్పుల ఒత్తిడి వరకు
తదుపరి కథనం రైజింగ్ తెలంగాణ 2047: మహత్తర ఆశయాలా? లేక అప్పుల ఆధారిత భవిష్యత్తా? రైజింగ్ తెలంగాణ 2047: మహత్తర ఆశయాలా? లేక అప్పుల ఆధారిత భవిష్యత్తా?

ముఖ్యాంశాలు

  • విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు
    విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు
  • కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ నుంచి చివరి హెచ్చరిక: రేవంత్‌ను కాపాడేది వర్గం కాదు.. బలమైన కాంగ్రెస్ సంస్థే!
    కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ నుంచి చివరి హెచ్చరిక: రేవంత్‌ను కాపాడేది వర్గం కాదు.. బలమైన కాంగ్రెస్ సంస్థే!
  • సంస్కృతి అధికారంగా మారినప్పుడు:
    సంస్కృతి అధికారంగా మారినప్పుడు:
  • యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
    యువత అసంతృప్తి నుంచి కృత్రిమ మేధస్సు వరకు:  విశాఖ నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త  వ్యూహమా?
  • తమిళ నాడు బిజెపి అధ్యక్షుని వ్యాఖ్యలను ఖంధించిన నటి బుష్ బూ
    తమిళ నాడు బిజెపి అధ్యక్షుని వ్యాఖ్యలను ఖంధించిన నటి బుష్ బూ
  • ఆంధ్రప్రదేశ్‌కు వికేంద్రీకృత డేటా సెంటర్ వ్యూహం అవసరం – విశాఖకే ఎందుకు?
    ఆంధ్రప్రదేశ్‌కు వికేంద్రీకృత డేటా సెంటర్ వ్యూహం అవసరం – విశాఖకే ఎందుకు?

విభాగాలు

Andhra PradeshBusinessCrimeEducationInternationalNationalOpinionPoliticsTelanganaWorld

ఇవి కూడా నచ్చవచ్చు

భారత విద్యా వ్యవస్థకు కొత్త దిశ అవసరం – డిగ్రీలు కాదు, పరిశోధనలే దేశ భవిష్యత్తు

భారత విద్యా వ్యవస్థకు కొత్త దిశ అవసరం – డిగ్రీలు కాదు, పరిశోధనలే దేశ భవిష్యత్తు

4 నెలలు క్రితం
విమానాశ్రయాల నిర్మాణం – అభివృద్ధి మార్గమా? లేక రాజకీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులా?

విమానాశ్రయాల నిర్మాణం – అభివృద్ధి మార్గమా? లేక రాజకీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులా?

4 నెలలు క్రితం
ఎన్టీఆర్ స్ఫూర్తితో సంక్షేమం – ఇందిరమ్మ ఆశయాలతో అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

ఎన్టీఆర్ స్ఫూర్తితో సంక్షేమం – ఇందిరమ్మ ఆశయాలతో అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

6 నెలలు క్రితం
బాబా లాల్ దాస్ వారసత్వం — ధర్మం, సంయమనం, రాజకీయాల మధ్య నిలిచిన స్వరం

బాబా లాల్ దాస్ వారసత్వం — ధర్మం, సంయమనం, రాజకీయాల మధ్య నిలిచిన స్వరం

4 నెలలు క్రితం
Sudas Media

Your Voice. Your News.
Sudas Media ఒక వార్తా వెబ్‌సైట్. తాజా వార్తలను విభాగాల వారీగా చదవండి, మా పని విధానం ఇక్కడ ఉన్న పేజీల్లో చూడండి, లేదా మాకు రాయండి.

✉ info@sudasmedia.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© Sudas Media · sudasmedia.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?